పెబ్బేర్ ముద్ర
శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న అందరికీ సంబంధిత స్థానం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ తరఫున నిర్వహిస్తున్న ఈ ఎన్నికలో బూత్ స్థాయి అధ్యక్షులను నియమిస్తున్నామని బూతు స్థాయి అధ్యక్షుడికి గ్రామ అధ్యక్షుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వారు గ్రామ సర్పంచ్ తో సమానమని ఆ విధంగా పార్టీని బలోపేతం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ నేడు ముందుకు వచ్చినట్లు వారు పేర్కొన్నారు.
ఒక్కొక్క కమిటీలో 21 మంది ఉంటారని ఆ విధంగా కమిటీ ఏర్పాటు ఉంటుందన్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల కమిటీకి సంబంధించిన ఆశావాహుల పేర్లను వారు నమోదు చేసుకున్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్దిలేటి, జిల్లా మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, మండల అధ్యక్షులు రాములు యాదవ్, పీసీసీ జనరల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, OBC జనరల్ సెక్రెటరీ కోట్ల రవి, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదుని రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, న్యాయవాది తిరుపతయ్య మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, నాయకులు శ్రీహరి రాజు, బీరం రాజశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.