Take a fresh look at your lifestyle.

బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్థలం పరిశీలన చేశారు.మహానేత బాబు జగ్జీవన్ రామ్ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ముందు తరాలకు ప్రేరణగా ఉంటుందని ప్రజల కోరిక మేరకు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ నిబంధనల క్రమం గా ఏర్పాటు చేస్తామని తెలిపినారు. అయితే మంచినీళ్ళ భావి చౌరస్తా వద్ద ముదిరాజులు ఇక్కడ మహాత్మ జ్యోతి రావు పూలే విగ్రహం మాత్రేమే ఏర్పాటు చేయాలనీ కోరారు. అలాగే మరో సామజిక వర్గం తమకు చెందిన మరో నేత విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరారు. పరిశీలించి మూడు విగ్రహాలు ఒకే చోట ఏర్పాటు చేసే ఏర్పాట్లు చేస్తామని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.