Take a fresh look at your lifestyle.

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సౌందర్య రాజన్ మృతి పట్ల మంత్రి దామోదర్ సంతాపం

 ముద్ర,సంగారెడ్డి :

ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు,విద్యావేత్త డాక్టర్‌ ఎం.వి.సౌందర రాజన్‌ మృతి పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.ఆర్ దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా,రిజిస్ట్రార్‌గా విద్యా రంగానికి సేవలందించిన అనంతరం చిలుకూరు క్షేత్ర విశిష్టతను నలుదిశలా వ్యాపింపజేయడంలో సౌందర రాజన్‌ కీలక పాత్ర పోషించారని మంత్రి కొనియాడారు.విద్య, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన కృషి ఎనలేనిదని గుర్తుచేసుకున్నారు.
సౌందర రాజన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈవిషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు,స్నేహితులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.