Take a fresh look at your lifestyle.

మేడ్చల్ జిల్లాలో15 దాన్యం కొనుగోలు కేంద్రాలు- జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 15 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుగుణ బాయి, వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రకళ,జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రైతులు పండించిన వడ్ల లో ఎలాంటి దుమ్ము, తడి లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా వారిని చైతన్య పర్చాలని అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రైతులు దాన్యం అమ్మిన 48 గంటల లోగా వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.