ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్: పట్టణంలోని శ్రీ శ్రీనివాస పద్మావతి జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ముందంజలో నిలిచింది.
కొండూరు మేఘనా MPC విభాగంలో 468/470 మార్కులతో రాష్ట్రంలో 2వ ర్యాంక్, జిల్లాలో 1వ ర్యాంక్ సాధించి కళాశాలకు గౌరవం తీసుకువచ్చింది.
పీ. శ్రీ వాణి 464/470 మార్కులు సాధించగా,
ఎం. హరీష్ కుమార్ 464/470 మార్కులతో జిల్లాలో 2వ ర్యాంక్,
జి. సౌమ్య 463/470 మార్కులతో జిల్లాలో 3వ ర్యాంక్ సాధించారు.
BiPC విభాగంలో బి. మౌనిక 436/450 మార్కులతో జిల్లాలో 1వ ర్యాంక్ సాధించగా, వి. నిహారిక, బి. పావని ఇద్దరూ 434/440 మార్కులతో జిల్లాలో 2వ ర్యాంక్ సాధించారు.
CEC 1వ సంవత్సరం విభాగంలో జోహా అంజుమ్ 458/500 మార్కులతో కళాశాలలో 1వ ర్యాంక్ సాధించగా, వి. మనీశ్వర్ 443/500 మార్కులతో 2వ ర్యాంక్ సాధించాడు.
కళాశాల విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు, పలువురు అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మురళీధర్ రావు, యాజమాన్యం మరియు అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, నిరంతర పరీక్షల ద్వారా విద్యార్థులను ఉత్తమ ఫలితాల దిశగా తీర్చిదిద్దామని తెలిపారు.
తల్లిదండ్రులు కూడా కళాశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ పిల్లల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్ష వ్యక్తం చేసింది.