యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: స్థానిక హనుమాన్ నగర్ లో కొత్త రోడ్డు వేయించిన రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ కు, బుధవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చెడిపోయిన రోడ్డు వల్ల పదేళ్లుగా పడుతున్న అవస్థలను ఎన్నికలకు ముందు విన్నవించుకోగా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంవత్సర కాలంలోపే కొత్త రోడ్డు వేయించారన్నారు. ఇందుకుగాను నాయకులు మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేష్, జక్కుల దామోదర్, మార్కా రాజు, దేవనపల్లి చెక్రపాణి, అనుము రాములు, సారయ్య నాయక్, కిషన్ నాయక్, మహేష్, పరకాల ప్రశాంత్, అజయ్, మోత్కు అవినాష్, పూజారి రాకేష్, మారం కుమార్, దేవయ్య, రమేష్, వికాస్, స్థానిక కుటుంబాలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.