Take a fresh look at your lifestyle.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎన్. ఎస్.యు.ఐ యువకులు

 

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ఎన్.ఎస్. యు.ఐ యువ నాయకులు మజర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి యువకుల పాత్ర కీలకమని, వారి చేరికతో పార్టీలో మరింత ఉత్సవo వచ్చిందన్నారు. పాఠశాలల్లో, కళాశాలలో చదివే విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేంతవరకు విద్యార్థుల పక్షాన పోరాడగల సత్తా ఉన్న ఎన్ ఎస్ యు ఐ యువకులు పార్టీలో చేరడం చాలా శుభపరిణామమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నూతన కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు
వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.