Take a fresh look at your lifestyle.

రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాక్సింగ్ పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభను కనబరిచారు. 44 నుంచి 46 కిలోగ్రాముల విభాగంలో అనన్య, 48 నుంచి 50 కిలోగ్రాముల విభాగంలో కీర్తన ప్రతిభ చూపి కాంస్య పతకాలు సాధించారు. జిల్లానుంచి ఏడుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు పతకాలు సాధించడం పట్ల డి వై ఎస్ ఓ శ్రీకాంత్ రెడ్డి వారిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.