ముద్ర మల్కాజిగిరి
మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా రెండవ దశ ప్రవేశాల కోసం నమోదు ప్రారంభమైనట్లు కళాశాల అధికారులు తెలిపారు. విద్యార్థులు మే 25వ తేదీ లోపు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాల ఎంపిక సమయంలో 12090 కోడ్ కలిగిన మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసుకోవాలని కోరారు.
ఈ కళాశాలలో బిఎస్సీ, బికాం, బిఎ వంటి కోర్సులతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాబులో ఉన్నాయని దోస్త్ సమన్యయకర్త డా అడవి రాజు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బండి రాజు మాట్లాడుతూ ప్రవేశాల ప్రక్రియలో విద్యార్థులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వేసవి సెలవుల్లో కూడా సిబ్బంది కార్యాలయంలో అందుబాటు లో ఉంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం దోస్తే సహాయకులు 9966911448, 9440867068, నంబర్లను సంప్రదించ వచ్చని తెలిపారు. విద్యార్థులు చివరి తేదీకి ముందే నమోదు పూర్తి చేసి తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.