Take a fresh look at your lifestyle.

అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు : భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ప్రజా పాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక 22వ వార్డు ఇందిరా నగర్ లో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, భీమా పథకాలు అమలు అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే ప్రజలకు రేషన్ కార్డులు అందాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు. భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు చేపట్టబోతున్న పథకాల గురించి వివరంగా తెలియజేయడానికి మంచి అవకాశం అని, ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్న వార్డు సభలలో తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవాయిస్ చిస్తి, వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, ఇంచార్జీ మున్సిపల్ కమీషనర్ కె. నరేష్ రెడ్డి, వార్డు సభ్యులు జాలిగం విగ్నేష్, బొంతల నర్సింగ్ రావు, బర్రె పూజిత జహంగీర్, సుధాగాని సరిత రాజు, నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.