కామ్రేడ్ దుర్గయ్య కి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు.- సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి.
ముద్ర,కుత్బుల్లాపూర్:
భారత కమ్యూనిస్టు పార్టీ కొత్తలాపూర్ మండలం మాజీ సాయం కార్యదర్శి దళిత కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు కామ్రేడ్ దుర్గయ్య గారి మృతదేహానికి నేడు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ గార్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసి వారి మృతి పార్టీకి మరియు వారి కుటుంబానికి ప్రజలకు తీరని లోటని, తండ్రి నుండి వారసత్వంగా పార్టీలో పనిచేసే అనేక పదవులను అనుభవించి నిత్యం పేద ప్రజల కోసం సాయపడేవాడని, దుర్గయ్య గారి మృతితో పేద ప్రజలకు తీరని నష్టమని అలాంటి మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. స్మశాన వాటిక కు పేదవాళ్లు వస్తే అది తక్కువ ఖర్చులతో దాహన సంస్కారాలను చేసి ప్రజల దగ్గర ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను గురి చేయకపోయేవాడని చుట్టుపక్కల వాళ్లందరూ దుర్గయ్య పై మంచి అభిప్రాయం ఉండేదని అలాంటి వ్యక్తి ఆరోగ్యం పైన శ్రద్ధ చూపకపోవడం వల్ల అనారోగ్యంతో మృతి చెందడం తీరని బాధని వారికి వారి కుటుంబానికి సిపిఐ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి,సాయిలు గౌడ్,ఏసురత్నం, మండల కార్యదర్శి స్వామి,సహాయ కార్యదర్శులు హరినాథ్,రాములు, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్,బాబు యువజన కార్యదర్శి వెంకటేష్ సిపిఐ నాయకులు సాధనంద్, నర్సింహారెడ్డి, సాయిలు, వెంకటేష్,సహదేవ రెడ్డి,మహిళా సమాఖ్య అధ్యక్షులు హైమావతి, సత్యవతి, మహేశ్వరి,డేనియల్,నర్సయ్య,యదన్న,రవి,నాగేష్,శ్రీనివాస్ చారీ,శ్రీనివాస్ ల తో పాటు వందలాది మంది పాల్గొన్నారు.ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలు జండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది.