ముద్ర కాప్రా:
సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ కైలాసగిరి బంజారా భవన్ లో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని తెలిపారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని, దీంతో శ్రీ సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని,
సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా గిరిజనుల ఆత్మగౌరవం ప్రతిబింభించేలా సేవాలాల్ బంజారా భవనాన్ని సీఎం కేసీఆర్ నిర్మించారాని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శ్రీనివాసులు రెడ్డి, ప్రభుదాస్ స్థానిక నాయకులు వంజరి ప్రవీణ్ రామక్రిష్ణ, సామ్ సన్, భూలక్ష్మీ బంజారా యువతీ యువకులు పాల్గొన్నారు.