- జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చెదలు సత్యనారాయణ.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని, ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచన మేరకు, శుక్రవారం రోజు జిల్లా కాపు సంఘ అధ్యక్షులు చెదలు సత్యనారాయణ సంఘ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న మున్నూరు కాపు కళ్యాణ భవన సహకారానికి కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అమీరిశెట్టి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు పుప్పాల రాజేష్, చిన్నం తిరుపతి, సంయుక్త కార్యదర్శి దొనకంటి గంగాధర్, రైతు అధ్యక్షులు ఎలిసెట్టి గంగారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త కోలగాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.