తుర్కపల్లి, ముద్ర:
తుర్కపల్లి మండల కేంద్రంలో రెవిన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు చాలా తక్కువగా ఉన్నాయని భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల విస్తరణ ,ప్రజా అవసరాల కోసం రావాల్సిన స్థలం లేదని తుర్కపల్లి గ్రామ సర్పంచ్ సోమల వెంకటేశం, ఉప సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్ లు అన్నారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రవికుమార్ గ్రామపంచాయతీ పాలకవర్గం సన్మానించారు. అనంతరం వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను కేటాయించకూడదని, ఇప్పటికే కేటాయించిన భూములను కూడా తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ తీర్మానాన్ని తహసిల్దార్ కు అందజేశారు. గ్రామ అభివృద్ధి పనులు, కొత్త ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం, గ్రామపంచాయతీ కార్యాలయ విస్తరణ ,పార్కులు ,కమ్యూనిటీ హాల్ వంటి ప్రజా అవసరాల కోసం భూమి అత్యవసరమని అన్నారు. గ్రామ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న రెవిన్యూ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత కేటాయింపులు ప్రాధాన్యత పొందకూడదని ప్రభుత్వ భూములు గ్రామ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని అన్నారు. గ్రామంలో అందుబాటులో ఉన్న రెవిన్యూ భూముల వివరాలు భవిష్యత్తు అవసరాల అంచనా ఇప్పటికే జరిగిన కేటాయింపులపై అభ్యంతరాలను స్పష్టంగా వివరించారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సముచిత చర్యలు తీసుకోవాలని కోరారు .గ్రామ అభివృద్ధి ప్రజల అవసరాల కోసం ఉన్న భూములను కాపాడడం గ్రామపంచాయతీ సర్పంచిగా తన బాధ్యత అని ప్రభుత్వ భూములు గ్రామ ప్రజల సొత్తు అని వాటిని సమాజ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని అన్నారు. ఇప్పటినుండి గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను ఎలాంటి కేటాయింపులు జరుపకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు భోయిని అరవింద్, సోమల కర్ణాకర్, బండారి రవి, కోట భాగ్యలక్ష్మి విజయ్, కోట జాన్సన్, గుండబోయిన రమణా రమేష్, తరణి సుమని శ్రీహరి, కాసబోయిన కవిత రాజమౌళి, షేక్ నజీర్, తదితరులు పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.