Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం

జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు

సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం

జహీరాబాద్ నుంచి సదాశివపేట పట్టణ సమీపంలో (బైపాస్ 65 జాతీయ రహదారిపై) శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు,లారీ ఢీకొన్నాయి.బస్సులో ప్రయాణిస్తున్న 14మందికి తీవ్ర గాయాలయ్యాయి.సిఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం…. బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు
సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు.ఈబస్సు ప్రమాదంలో గాయపడిన వారు వట్పల్లి కి చెందిన ఆవసలి బసవరాజు (25),చిన్నశంకరం పేటకు చెందిన షేక్ మహబూబ్(55), బిలాలు పూర్ కు చెందిన గొల్ల కాంసమ్మ(33), హైద్రాబాద్ కు చెందిన హిమ బిందు(37), మానూర్ మండలం తోరణాలకు చెందిన మెత్తరి జర్నమ్మ(55), కూల్చారం మండలం మగ్దూంపూర్ కు చెందిన మహేశ్వరి(23), మునిపల్లీ మండలం భూదేరా కు చెందిన గౌసియా బేగం(52), హైద్రాబాద్ కు చెందిన సోమేశ్వర(22),జహీరాబాద్ కు చెందిన మారుతి(30), కోహీర్ మండలం బిలాలు పూర్ కు చెందిన బస్సు కండక్టర్ కళ్ళెం అంజయ్య (55),మునిపల్లీ మండలం పెద్ద గోపులారం కు చెందిన శ్రీలత(23),సదాశివపేట మండలం అంకేనపల్లి కు చెందిన మీన (25),ఝారసంఘం మండలం బిడెకన్నెకు చెందిన రత్నమ్మ(56),మర్పల్లి మండలం నాగిరెడ్డిపల్లి కి చెందిన రాధిక(38),తీవ్రంగా గాయపడ్డారు.గాయపడ్డవారిని మెరుగైన చికిత్స అందించేందుకు పోలీసులు అంబులెన్స్ సహాయంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేష్ తెలిపారు.గాయపడ్డవారిని జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ సందర్శించారు.

 

Leave A Reply

Your email address will not be published.