Take a fresh look at your lifestyle.

ప్రతి నెల ఐదవ తేది లోపు వేతనాలు చెల్లించాలి ఆశ వర్కర్ల డిమాండ్

ముద్ర, శేరిలింగంపల్లి:

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోవర్గ కేంద్రంలోని పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఐదవ తేది లోపు వేతనాలు చెల్లించాలని, నెలకు 18,000 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఉద్యోగ బధ్రతతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టాలని సీఐటీయు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సంవత్సర కాలంగా ఫెండింగ్ లో ఉన్న వేతనాలు అనేక పోరాటాల ఫలితంగా గత నెల విడుదల చేసిన ప్రభుత్వం ప్రస్తుతం రెండు నెలల వేతనాలు పండింగ్ లో పెట్టడం విడ్డూరంగా ఉందన్ననారు. మెమోరాండం సమర్పించిన కార్యక్రమంలో ఆశా వర్కర్లు నీరజ, వనజ ధర్మజ, హేమలత, సుజాత, ఎండి సల్మా, మంజుల, నాగలక్ష్మి, భారతి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.