Take a fresh look at your lifestyle.

షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొలాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తనైన రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్లను సరిచేయాలని గ్రామస్థులు విద్యుత్ సిబ్బందిని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.