ముద్ర ప్రతినిధి, మెదక్
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చైతన్య రథంను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనుందన్నారు.

జనసంచారం అధికంగా ఉండే జంక్షన్‌లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారని, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎఆర్ డియస్పి రంగనాథ్, సీఐలు మహేష్, జార్జ్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐలు శైలందర్, రామకృష్ణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
షార్ట్ ఫిల్మ్ ప్రారంభం
ఇంటికి చేరాలి అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, యువతలో రహదారి భద్రతపై సరైన అవగాహన కల్పించడం లక్ష్యంగా మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల కార్యక్రమం – సురక్షిత ప్రయాణంలో భాగంగా…ప్రాజెక్ట్ ఏబీసీ 3.0 కింద రూపొందించారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందించారు.
హెల్మెట్ ధరించడం ఒక ఎంపిక కాదు, అది ప్రాణ రక్షణకు అవసరం అన్నారు.