Take a fresh look at your lifestyle.

పీఆర్సీపై సిఎం తక్షణమే ప్రకటన చేయాలి ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్:*
తెలంగాణ నూతన పీఆర్సీపై ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటన చేయాలని ఎస్టీయూ టియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు.
బుధవారం ఎస్టీయూ భవన్ లో ఏర్పాటు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గజేందర్ మాట్లాడుతూ… ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. నూతన ఈహెచ్‌ఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి, రెగ్యులర్ ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులివ్వాలని డిమాండ్ చేశారు. జీవో 190 ప్రకారం ఇంటర్ లోకల్ డిప్యూటేషన్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పాఠశాల విద్యాశాఖ హేతుబద్దీకరణ పేరుతో ఖాళీ పోస్టులను రద్దు చేసే ఆలోచన మానుకోవాలని అన్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ లో ప్రభుత్వం కేటాయింపులు పెంచాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, దానికి అవసరమైన విద్యా హక్కు చట్టం సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, రాష్ట్ర బాధ్యులు నర్సిములు, రాజు, జిల్లా ఆర్ధిక కార్యదర్శి కిష్టయ్య, భూపతిగౌడ్, అశోక్, నాగరాజు,శ్రీనివాస్,బాలకృష్ణ వేణు గోపాల్, శివప్రసాద్,ఎల్లం,అరుణు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.