ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 6వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిబిరం (సమ్మర్ క్యాంపు)ను గురువారం రోజు జగిత్యాల జిల్లా విద్యాధికారి కె.రాము పర్యవేక్షించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవికాలంలో సమయాన్ని వృధా చేయకుండా ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కుట్టుపని, మ్యూజిక్, డ్రాయింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, చెస్, సింపుల్ సైన్స్ ఎక్స్పరిమెంట్, ఇన్డోర్ గేమ్స్, మోడలింగ్, మ్యాథమేటిక్స్, క్విజ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వంటి పలు అంశాలలో నిపుణులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 100 మంది విద్యార్థులకు అవకాశం ఉందని ఆసక్తి గల విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అల్పాహారం, నీటి వసతి అందుబాటులో ఉందని తెలిపారు. పదవ తరగతి రిమీడియల్ తరగతులను విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కోరుట్ల మండలంలో ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ నందు ఉత్తమ గణాంకాలు నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.గంగాధర్, ఉపాధ్యాయులు, సి.ఆర్.పి లు గంగాధర్, సత్యనారాయణ, జ్యోతి, మాన్వితలు పాల్గొన్నారు.