Take a fresh look at your lifestyle.

మొక్కజొన్న కొనుగోలులో కేంద్ర అసమర్థత వల్ల తెలంగాణ రైతులకు నష్టం…ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్…

మద్దతు ధర ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుంటుంది…
చలిగల్ లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న…
కావాలని నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు….

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

మొక్కజొన్న కొనుగోలులో కేంద్ర అసమర్థత వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుందని, మద్దతు ధర ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ లో ప్రెస్ క్లబ్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధికి రాజకీయాలతో ముడి పెట్టవద్దని, విద్యార్థుల
చదువులతో రాజకీయ లబ్ధి పొందవద్దని పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయమని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. జగిత్యాల మండలం చల్గల్ కేంద్రీయ విద్యాలయానికి స్థలం విషయంలో ఎంపీ అరవింద్ ఇరిగేషన్ శాఖ మంత్రితో వారికున్న సత్సంబంధాలతో మాట్లాడవచ్చు అని అన్నారు. గతంలో చల్గల్ వాలంతరీ కేంద్రం రైతుల కోసం ఏర్పాటు చేసిందని, చల్గల్ లో ఎంపీ అరవింద్ కి మద్దతుగా ఉన్న రైతులే అక్కడ కేంద్రీయ విద్యాలయం వద్దని నిరసన తెలిపారని అన్నారు. చల్గల్ లో విద్యా సంస్థల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది వారి కార్యదర్శులతో నిత్యం మాట్లాడుతున్నానని తెలిపారు. జిల్లా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు సైతం చలిగల్ లో విద్యాసంస్థల ఏర్పాటుకు పూర్తి సానుకూలంగా ఉన్నారన్నారు. కేంద్రీయ విద్యాలయం
విషయంలో ఎంపీ అరవింద్ నన్ను కావాలని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అడ్మిషన్లు వచ్చిన తర్వాతనే ఇతరులకు కేటాయిస్తారని తెలిపారు. ఎంపీ అరవింద్ తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులు జెవెల్ ఓరం , దుర్గా దాస్ లను కలిసి బోర్నపల్లి – జగన్నాథ్ పూర్ బ్రిడ్జి మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేయగా ఇప్పటివరకు సమాధానం లేదని పేర్కొన్నారు. జగిత్యాల- ధర్మపురి, జగిత్యాల – రాయికల్, జాతీయ రహదారుల వంతెనలు నిర్మాణం కోసం పలుమార్లు వినతి పత్రాలు అందజేసిన ఫలితం మాత్రం శూన్యం అని అన్నారు. నవోదయ పాఠశాలను కోరుట్లకు కేటాయించారని, జగిత్యాల ప్రజల పట్ల ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వరి మొక్కజొన్నలకు మద్దతు ధర గొప్పగా ప్రకటించిన, చేతల్లో మాత్రం రైతులకు మద్దతు లేదన్నారు. మొక్కజొన్న కొనుగోలుతో ప్రతి క్వింటాలకు వెయ్యి రూపాయలు రాష్ట్రం నష్టాన్ని భరిస్తుందని, మొక్కజొన్న, వరి కొనుగోలు తో మార్క్ ఫెడ్ సివిల్ సప్లై కార్పొరేషన్ లు నష్టాల్లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు , ఆత్మ ఛైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి, పాక్స్ చైర్మన్ ధీటి రాజి రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, గనే రాజీరెడ్డి, కోల శ్రీనివాస్ , రవీందర్ రావు,బెజ్జంకి మోహన్,సురేందర్ నాయక్,సింగం రమేష్,గంగాధర్, మర్రిపెల్లి శ్రీనివాస్,తలారి రాజేష్,వేణు,
రాజేష్,ఇర్ఫాన్, మురళి, రాకేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.