Take a fresh look at your lifestyle.

సియం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కేంద్రం దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టడానికి ఆమోదం తెలపడం పై జగిత్యాల ఎమ్మెల్యే .డా సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కుల గణన చేపట్టి, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా,అసెంబ్లీ లో కుల గణన పై ఆమోదం తెలిపిదేశానికి దిక్సూచిగా మారీ కేంద్రం పై ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ కమిటీ దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టడానికి ఆమోదం తెలపడంపై సియంను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ కిరణ్ కుమార్, వీర బతిని అనిల్, సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.