Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, డి.ఆర్.ఒ సంగీత

 

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):

జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను సోమవారం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా డీఆర్వో సంగీత విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులకు మార్చి నెల 4 వ తేదీన హెల్త్ క్యాంప్ ని ఏర్పాటు చేయాలని జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె రామారావు జిల్లా కలెక్టర్ ను కోరారు. అదే రోజు వారికి ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రత్యేక అనుమతి ఇప్పించాలని అభ్యర్థించారు. మార్చి 7వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అనుమతినివ్వాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఓ ద్వారా వినతి పత్రాన్ని సమర్పించామని రంగారెడ్డి జిల్లా టిజీఓ అధ్యక్షులు డాక్టర్ కే రామారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా ప్రతినిధులు శాంతిశ్రీ, రేవతి, అలివేలు, మహేశ్వరి, సైదమ్మ, బాలేశ్వరి, డా.నరేందర్, మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.