ముద్ర, ప్రతినిధి సంగారెడ్డి.
తారా ప్రభుత్వ కళాశాల ,ఎన్ఎస్ఎస్ విభాగాలు రెండు మరియు నాలుగు ఆధ్వర్యంలో కల్పకూర్, అంగడిపేట గ్రామాలలో మరియు ఎన్ఎస్ఎస్ 3 ఆధ్వర్యంలో మల్కాపూర్ లో రెండవ రోజు శీతాకాల శిబిరంలో భాగంగా గైడెన్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపినారు. అజీమ్ ప్రేమ్ జి ఫౌండేషన్ కళాశాల క్యారియర్ గైడెన్స్ సెల్ సహకారంతో పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా విచ్చేసిన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అధికారి కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం ఏడు కోర్సులలో ఉచితంగా హాస్టల్ సదుపాయముతో పాటు విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపినారు.
మల్కాపూర్ గ్రామంలో బాలికల శీతాకాల శిబిరములో హై స్కూల్ గెజిటెడ్ హెచ్.ఎం. యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని తెలుపుతూ ఎన్ఎస్ఎస్ ఆవశ్యకతను వివరించడం జరిగిందని ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాణి తెలిపారు. ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ సాంబశివుడు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక స్పృహను కలిగి ఉండాలని, సామాజిక సేవ పట్ల సరియైన అవగాహనను పెంచుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపినారు. భారతదేశ అభివృద్ధి యువతరం పైననే ఆధారపడిందని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ సదయకుమార్, డాక్టర్ వాణి ,డాక్టర్ సిహెచ్ జోష్నా, క్యారీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ కరుణ, అధ్యాపకులు మిథున్ కుమార్ రాథోడ్, టిఎస్కేసి మెంటర్ రమణారావు ,హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం యాదగిరి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సాంబశివుడు, పాఠశాల అధ్యాపక బృందము తదితరులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.