ముద్ర కూకట్‌పల్లి :
కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవస్థాన వ్యవస్థాపకులు, ప్రముఖ అన్నదాత పూజ్య శ్రీ పుల్లారు నారాయణదాసు 26వ ఆరాధన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయానికి చేరుకున్న రాజేశ్వరరావు కి ఆలయ నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన నారాయణదాసు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ
”నిగర్విగా, నిరతాన్నదాతగా పేరుగాంచిన పుల్లారు నారాయణదాసు గారు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమావధిగా జీవించిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.”
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు