Take a fresh look at your lifestyle.

పాత్రికేయ రంగానికి శ్రీనివాస్ రెడ్డి సేవలు అభినందనీయం: మీడియా అకాడమీ చైర్మన్‌గా రెండవసారి బాధ్యతలు

 

‘ఫారెస్ట్ నేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాత్రికేయ వర్గాల అభినందనలు
పాత్రికేయ రంగానికి చేసిన సేవలను ప్రశంసించిన శరత్ నల్లమోతు
శ్రీనివాస్ రెడ్డి జీవితం, సేవలపై రూపొందించిన ప్రత్యేక ఏవీ ప్రదర్శన
పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు సంఘాల నేతలు, మీడియా ప్రతినిధులు

ముద్ర న్యూస్ బ్యూరో
హైదరాబాద్: మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గా రెండవసారి నియమితులైన కే శ్రీనివాస్ రెడ్డికి ‘ఫారెస్ట్ నేషన్’ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శరత్ నల్లమోతు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. హైటెక్ సిటీ లోని ఫారెస్ట్ నేషన్ కార్పొరేట్ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శరత్ ఆయనను శాలువతో సత్కరించి, పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి జీవిత విశేషాలు, పాత్రికేయ వృత్తిలో అందుకున్న పదవులు, సత్కారాల గురించి రూపొందించిన ఏవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి విశేషంగా కృషి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి రెండవసారి మీడియా అకాడమీ చైర్మన్ పదవి దక్కడం సముచితమని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.


ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజే యూ )స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ, నగునూరి శేఖర్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యూజే ) అధ్యక్షులు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ, కార్యదర్శులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, మధు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కిరణ్, సిహెచ్ శ్రీనివాసరావు, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ( హెచ్ యూజే) అధ్యక్షుడు ఎస్ శంకర్ గౌడ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, రాష్ట్ర చిన్న, మధ్య తరహా పత్రికలు, మ్యాగజైన్ల అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కే ఎన్ హరి, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వనం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ హరీష్, మెట్రో టీవీ ఎండీ కొండవీటి జయప్రసాద్, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఆజం ఖాన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.