Take a fresh look at your lifestyle.

సంస్థాగత ఎన్నికల సన్నహాక సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, ముద్ర విలేఖరి: పార్టీ సంస్థాగత నిర్మాణంలో చిత్తశుద్ధితో పని చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని ఎమ్మెల్యే క్యాంప్ ఆవరణలో గురువారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తుందను అన్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయని, వేలాది మంది కార్యకర్తలకు పదవులు దక్కే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకవెళ్ళాలనీ అన్నారు.ఈ సమావేశంలో మంథని మున్సిపాలిటీకి, ముత్తారం మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నామినేటెడ్ పదవుల ఆశవాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమములో తెలంగాణ వక్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, టీపీసీసీ పరిశీలకులు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.