Take a fresh look at your lifestyle.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థనలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అదనపు కలెక్టర్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.