Take a fresh look at your lifestyle.

ధరణి తో అన్నదమ్ముల మధ్య, తగాదాలు

  • రైతుల భూములకు రక్షణ కవచంగా భూభారతి.
  • భూభారతి చట్టంతో భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం.
  • ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం.
  • ఎమ్మెల్యే మందుల సామేల్.

తుంగతుర్తి, ముద్ర: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం రైతులకు విశ్వాసం కల్పించే విధంగా వారి భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతీ చట్టాన్ని తీసుకు వచ్చిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన భూభారతి రెవిన్యూ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి తో గ్రామాల్లో అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయని అన్నారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకువచ్చిందన్నారు. భూభారతి చట్టం ద్వారా నూటికి నూరు శాతం భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అధికార కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందని అందుకే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష్ కుమార్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి తుంగతుర్తి సింగిల్ విండో డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి, తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఎల్సోజి నరేష్,ఆలయ చైర్మన్ ఎనగందుల సంజీవ, జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు ,సుంకరి జనార్ధన్, పట్టణ అధ్యక్షుడు ఉప్పల రాంబాబు,దాసరి శీను, కలకోట్ల మల్లేష్, కొండరాజు, మంగళపల్లి నాగరాజు, కటకం సూరయ్య, వీరబోయిన రాములు, ముత్యాల వెంకన్న , మల్లెపాక సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.