- ఉచితంగా పలు శస్త్ర చికిత్సలు.
- ఏం.ఆర్.ఐ సేవలు కూడా ప్రారంభిస్తాం.
- పెద్దపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావు.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా పనిచేస్తుందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి మొదటిసారిగా ప్రభుత్వం తరుపున ఉచితంగా కళ్ళద్దాలను ఆసుపత్రి సూపరిండెంట్ మరియు సిబ్బందితో కలిసి పంపిణీ చేసారు.అనంతరం ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తునందుకు గాను సూపరిండెంట్ గారిని మరియు వైద్యులను గౌరవ ఎమ్మెల్యే అభినందించారు.మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతనమైన వైద్య పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు అందిస్తూ పేద కుటుంబాలకు సహాయసహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు తగ్గకుండా ప్రభుత్వ ఆసుపత్రి అన్ని విధాలుగా సేవలను అందిస్తూ పేదవారికి వైద్య ఖర్చులు లేకుండా చేస్తున్నామని గుర్తుచేశారు. మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గణనీయమైన మార్పులు చేశామని అన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు మరియు నియోజవర్గ ప్రజలందరూ ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి శస్త్ర చికిత్స గాని, డయాలసిస్, చర్మ వైద్యం, ముక్కు, నోరు, గొంతు మరియు చిన్న పిల్లల వైద్యం అలాగే నవజాతి శిశువుల కోసం మెరుగైన వైద్య సేవలు, మాత శిశు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం మరియు గర్భిణీ స్త్రీలకు అధిక ఖర్చుతో కూడిన తిఫ్ఫా స్కానింగ్ ను సైతం ఉచితంగా చేయడం లాంటి మరెన్నో వైద్య సేవలు ప్రభుత్వం తరుపున ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీధర్, ఆర్.ఏం.ఓ, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.