- తన తప్పును ఒప్పుకోవాలి.
- ఆయన చేసిన తప్పులకు ఉన్నతాధికారుల మూల్యం చెల్సించాల్సిన పరిస్థితి నెలకొంది.
- వెంటనే గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్దరించాలి.
- డిమాండ్ చేసిన కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతోనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకోవాలన్నారు.రేవంత్ తీసుకున్న మూర్ఖత్వపు నిర్ణయాలతో ఉన్నాతాధికారులు మూల్యం చెల్సించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.పరిస్థితి ఇంకా చేయిదాటకముందే గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్ధరించాలని కోరారు.ఈ భూముల వ్యవహారంపై గురువారం కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్‌ను హెచ్చరించిన సుప్రీంకోర్టు కంచె గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపించాలా? అంటూ హెచ్చరించిందన్నారు.రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని గురువారం ఎక్స్ ద్వారా కేటీఆర్ పేర్కొన్నారు వీటికి తాను బాధ్యుడిని కాదని రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదన్నారు.కంచె గచ్చిబౌలి భూములను అమ్మి పది వేల కోట్ల రూపాయల స్కాం చేయడం ముమ్మాటికి అవినీతి, నమ్మకద్రోహమేనని అన్నారు.సెలవు రోజుల్లో ల్లో బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనలేనని కేటీఆర్ అన్నారు.సీఎం బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తాను సృష్టించిన విధ్వంసానికి, బాధ్యతారాహిత్యానికి, చేసిన పది వేల కోట్ల స్కాంకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Prev Post
Next Post