Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట అభివృద్ధిపై అవినీతి ఆరోపణలు… బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

సిద్ధిపేటలో అభివృద్ధి పేరిట మీరు చేసిన అవినీతి గురించి చెప్పండి

* ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రజల ధనంతో కట్టారు

* 10 సంవత్సరాలలో దోచుకున్న సొమ్ముతో కట్టినట్లు తెగ ఫీల్ అవుతున్నారు బిఆర్ఎస్ నాయకులు

* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు

సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తుఇమామ్

ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:

10 సంవత్సరాలలో సిద్ధిపేటలో అభివృద్ధి పేరుతో ఎంత అవినీతి చేశారో ముందు ప్రజలకు చెప్పలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తుఇమామ్ డిమాండ్ చేశారు.

సిద్ధిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో
మాట్లాడుతూ నంగునూరు మండలంలో నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీనీ ప్రజల ధనంతో కట్టారన్నారు.10 సంవత్సరాలలో దోచుకున్న సొమ్ముతో కట్టినట్లు బిఆర్ఎస్ నాయకులు తెగ ఫీల్ అవుతున్నారని ఏద్దేవా చేశారు. అధికారం ఉంది అని అడిగే వారు ఎవరు లేరని ధీమాతో 10 సంవత్సరాలలో లక్షల కోట్లు రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు, ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీనీ ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాకరీ ప్రాంభించేందుజు వస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కార్యక్రమాన్ని అడ్డుకుంటాం అని బిఆర్ఎస్ అంటున్నరన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకొదు అని హెచ్చరించారు. ఒకవైపు స్వాగతిస్తున్నాం అని చెప్పి మరోవైపు అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణములో మీకు రావలసిన వాటాల కమీషన్ రావడం వల్లే ఫ్యాక్టరీ ప్రమేయం ఆలస్యమయింది అని ఆరోపించారు. తప్పు మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. బిఆర్ఎస్ నాయకులు మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలని హితవు పలికారు.మీరు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారన్నారు.రాష్ట్ర ఖజానాకు దోచుకొని నయాపైసా లేకుండా చేశారని గత ప్రభుత్వం చేసిన అప్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెల్లిస్తు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారూ. పైగా సిద్ధిపేట అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు అని మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలన్నారు. ప్రభుత్వం నుండి నిధులు రాకుండా మీరే అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ అప్రతిష్ట పాలు చేస్తున్నారు అని అన్నారు. మరోసారి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కబర్దార్ అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ చిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు అని అన్నారు. అందుకే ఈ మధ్యలో జరిగిన అన్నీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు అని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అని అంటే మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు గాయాజుద్దీన్ హర్షద్ రాజిరెడ్డి శేఖర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.