Take a fresh look at your lifestyle.

ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్:*
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈనెల 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మోడీ పాలనలో దేశంలో ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెంచే విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. విబి జిరాంజి 2025పేరుతో ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారలు వేసిందని అన్నారు. లేబర్ కొడ్స్ అమలు చేసి కార్మికుల హక్కులను కలరస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ,
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెమోలు ఉపసంహరించుకోవాలి
ఈనెల 16న ప్రజాస్వామ్య యుతంగా ధర్నాలో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు మెమో జారీ చేసిన వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
అదనపు కలెక్టర్ నగేశ్ ku వినతిపత్రం అందజేశారు. సిఐటీయు జిల్లా కోశాధికారి కే నర్సమ్మ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రం నిర్వాహకులు పెండింగ్ వేతనాలు, వేతనాలకు పెంపు, పని భారం తగ్గించటం లాంటి సమస్యలపై హైదరాబాద్ లో ధర్నా చేయాలని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (సిఐటియు) పిలుపు ఉందన్నారు. ఈ ధర్నా విషయం రాష్ట్ర, జిల్లా, ప్రాజెక్టు స్థాయిలో ఐసిడిఎస్ అధికారులకు రాత పూర్వకంగా తెలియజేశామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.