Take a fresh look at your lifestyle.

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే చట్టపరమైన చర్యలు

  • అధిక శబ్దం కలిగించే 130 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ధ్వంసం.
  • రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి.
  • జిల్లా ఎస్పి అశోక్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాల పై జగిత్యాల జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ద్విచక వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న 130 వాహనాల సైలెన్సెర్స్ లను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు.ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని,శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు. మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేయిస్తామని హెచ్చరించారు.ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్‌ను కొనసాగిస్తూనే ఉంటుందని, ఇలాంటి చర్యలు వలన శబ్ద కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా తగ్గుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు. ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ , సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.