బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న రామాలయానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ తెలిపారు. ఆదివారం తేజాపూర్ గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు, రామాలయం కమిటీ సభ్యులు నేరడిగొండ లోని ఆడే గజేందర్ ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని గ్రామస్థులు ఆయనను కోరగా స్పందించిన ఆయన రామాలయం మందిరం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే రామాలయం మందిరం వద్ద రూ.10 లక్షల వ్యయంతో మండపం నిర్మాణంకు త్వరలోనే భూమిపూజ కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, రామాలయం కమిటీ సభ్యులు ఆడే గజేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.