Take a fresh look at your lifestyle.

యువత ఆరోగ్యంపై దృష్టి సారించండి అదనపు కలెక్టర్ రాజేశ్వర్

బోథ్, ముద్ర:

యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి చేపట్టిన 5కే మారథాన్ రన్ లో వారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబెడ్కర్ చౌక్ మీదుగా తిరిగి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు సాగింది. ఈ రన్ లో ఉద్యోగులు, యువత, వివిధ వర్గాల వారు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, ఉత్సాహంగా పాల్గొన్నారు. 5K రన్ లో గెలిచినా విజేతలకు ఈ సందర్బంగా మెడల్స్, ప్రశంస పత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నిత్యజీవితంలో యోగాన్ని భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్బంగా జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం ధ్యానం యోగ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, డిఆర్డిఓ రాథోడ్ రవీందర్, డిపిఓ రమేష్, సంక్షేమ అధికారి మిల్కా, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, క్రీడ కోచ్లు, అధికారులు, యువత, ఉద్యోగులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.