రామకృష్ణాపూర్, ముద్ర : ఈ నెల 20 న జరిగే బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయాన్ని భక్తులకు గుర్తుచేసే విధంగా ఏర్పాటు చేసిన కామన్ (బోర్డ్) శనివారం ప్రారంభించారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సింగరేణి,ఫారెస్ట్ అధికారుల సహకారంతో కామన్ (బోర్డ్) నిర్మాణం చేసినట్లు వారు చెప్పారు.
