Take a fresh look at your lifestyle.

క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ఎమ్మెల్యే డా.రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్:
క్షయ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని
ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ వి .2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ….క్షయవ్యాధి నియంత్రణలో ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్, ప్రజల్లో అవగాహన పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మొదటగా అధిక జనాభా గల ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి నాట్, మైక్రోస్కోపీ, ఎక్స్-రే ద్వారా నిర్ధారణకు పంపాలని అధికారులకు సూచించారు. డయాబెటిస్, పోషకాహార లోపం, వృద్ధులు, ఇతర సహవ్యాధులు ఉన్నవారిని ప్రాధాన్యంగా స్క్రీనింగ్ చేయాలని, అన్ని కేసులను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.


కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గుర్తించిన టీబీ రోగులకు తక్షణ చికిత్స అందించాలన్నారు. టీబీ నివారణకు ముందస్తు గుర్తింపు, వ్యక్తిగత పరిశుభ్రత, బీసీజీ టీకా TB లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ మాట్లాడుతూ ..జిల్లాలో అధిక ప్రమాదం ఉన్న 99 గ్రామాలు గుర్తించడం జరిగిందని, జిల్లావ్యాప్తంగా 389 కేసులు గుర్తించామని తెలిపారు. డిసిహెచ్ డా.శివ దయాల్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ టీబీ ముక్త భారత్ అభియాన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
అంతకుముందు క్షయ వ్యాధి నివారణకై కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం క్షయ వ్యాధి నివారణ కోసం పాటుపడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ హరిత నర్సింగరావు, సూపరిండెంట్ సరిత దేవి, శైలజ, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 49.30 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే రోహిత్ అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.