ముద్ర : మల్కాజిగిరి
వీకెండ్ సందర్భంగా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 321 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
వాహనాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
రెండు చక్రాల వాహనాలు – 249,
మూడు చక్రాల వాహనాలు – 11,
నాలుగు చక్రాల వాహనాలు – 59,
భారీ వాహనాలు – 2,
అందరినీ న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కలిగితే భారతీయ న్యాయ సంహిత – 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇక గత వారం 1తేదీ నుంచి 7 వరకు కోర్టులో మొత్తం 228 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కరించబడ్డాయి. అందులో
5 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష,
10 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ,
213 మందికి జరిమానా మాత్రమే విధించబడింది.
ఈ వివరాలను డీసీపీ మల్కాజిగిరి కమిషనరేట్ వెల్లడించారు.