Take a fresh look at your lifestyle.

వ్యక్తి పై దాడి చేసిన నిందితుల అరెస్ట్ మరో ముగ్గురి పరారీ….

 

ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణానికి చెందిన గంగుల సత్యార్థ ప్రకాష్ అనే అడ్వకేట్ మీద గుర్తుతెలియని దుండగులు గత నెల ఏప్రిల్ 24వ తేదీ రాత్రి దాడి చేశారు. ఈ దాడి పై అడ్వకేట్ కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడ్డ నలుగురు ఖైరీ లత, అరికొప్పుల శేఖర్, మాగాని మహేందర్, కుంచపు వెంకటేష్ లను పట్టుకున్నామని, మరొ ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుని కోర్టు ముందు హాజరు పరుస్తామన్నారు. పట్టుకున్న నిందితులను సంబంధిత కోర్టు వారి ముందు హాజరు పరిచి, 14 రోజుల రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై చిరంజీవి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.