Take a fresh look at your lifestyle.

అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లులో ప్రమాదకర అంశాలు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

 

 

న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలుపగా శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ బిల్లులో కొన్ని ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయన్నారు. న్యాయవాదిని అరెస్టు చేయాలంటే ప్రత్యేకంగా అంశంగా పేర్కొన్నారన్నారు. న్యాయవాది నేరానికి పాల్పడితే పోలీసులు బీఎన్ఎస్ ప్రకారం నడుచుకోవాలా లేక ఇతను అడ్వకేట్ కాబట్టి ఈ బిల్లు ప్రకారం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలా? నేరం చేసిన సాధారణ పౌరుడికి ఒక చట్టం, న్యాయవాదికి మరొ చట్టమా దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ బిల్లులో అడ్వకేట్ అయితే ఒక ప్రక్రియ, ఇతరులైతే మరో ప్రక్రియ అనే భావన ఈ బిల్లులో కనిపిస్తోందన్నారు. ఈ బిల్లు న్యాయవాదులకు రక్షణ కాదు ప్రత్యేక రాయితీ కింద కనిపిస్తోందన్నారు. మరోవైపు.. ఈ బిల్లులో పేర్కొన్న కమిటీల రక్షణ ద్వారా న్యాయవాదులపై నిజమైన ఫిర్యాదులను కూడా చల్లార్చే ప్రమాదం ఉందన్నారు. ఒక మహిళా బాధితురాలు న్యాయవాదిపై ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఈ కమిటీ వ్యవస్థ నిజాన్ని కనుగొంటుందా లేక సదరు న్యాయవాదికి రక్షణ గోడగా మారుతుందా స్పష్టత ఇవ్వాలన్నారు. హక్కులు విపరీతంగా ఉంచి బాధ్యతలు బలహీనంగా పొందుపర్చారన్నారు.

Leave A Reply

Your email address will not be published.