Take a fresh look at your lifestyle.

పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలి :ప్రభుత్వ విప్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి​భువనగిరి :

ఆలేరు ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం బైపాస్ రోడ్డులోని కొత్త వివేరా హోటల్లో ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఐలయ్య మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాలు జిల్లా అభివృద్ధిపై చర్చించి బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసే దిశగా దిశ నిర్దేశం చేశారు. సంఘటన సృజన అభియాన్ లో భాగంగా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సమగ్రంగా విశ్లేషణ చేస్తూ జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీ బలోపేతం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని వివరించారు. పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం అని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
అలాగే, సంఘటన సృజన అభియాన్ల భాగంగా పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రచార విధానాలు, యువత మరియు మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, సంఘటన సృజన అభ్యాన్’ జిల్లా కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నూతి శ్రీకాంత్, వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.