Take a fresh look at your lifestyle.

టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్ పదవీ కాలం పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఛైర్మన్ గోపాల్‌రెడ్డి కొనసాగింపు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ అడ్మిషన్స్‌, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్డి జస్టిస్‌ ఏ.గోపాల్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగేలా నిబంధనలకు సడలింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ అన్‌-ఎయిడెడ్ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా ఖరారు చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2027-28 వరకు వర్తించే ఈ కొత్త ఫీజులపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా జీవో నెం.06‌తో ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా నిర్ణయించిన ఫీజులు 2025-26 నుంచి 2027-28 విద్యా సంవత్సరానికి వర్తించనున్నాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సమర్పించిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ ఫీజులను నిర్ణయించింది. ఖరారు చేసిన ట్యూషన్ ఫీజులో అడ్మిషన్ ఫీజు, ఇతర ప్రత్యేక ఫీజులు కలవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.