Take a fresh look at your lifestyle.

పసుపు పంటకు మద్దతు ధరను అందించాలి : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

మెట్ పల్లి, ముద్ర : పసుపు పంటకు క్వింటాలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 15 వేల మద్దతు ధరను అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు. సోమవారం మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడారు.పసుపు పంటకు కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని రైతులు రేపు చేస్తున్న ధర్నాకు ప్రతి ఒక్క రైతన్న పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. రైతన్నలు కూడా ఓట్ల కోసం రైతులను మోసం చేస్తూ పదవిలో ఉంటూ పబ్బం గడుపుతున్న నాయకులని నిలదీయాలన్నారు. అంబాసిడర్ అని ఒక రోజు బెంజ్ కార్ అని ఇంకో రోజు రైతులను ఓట్ల కోసం వాడుకునే నాయకులని ప్రశ్నించాలసిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, వచ్చే సిసన్ లో పసుపు రైతులు కోటీశ్వరులు కాబోతున్నారు అని విచ్చల విడిగా అబద్ధాలు మాట్లాడిన నాయకులు ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చివరగా మరోసారి మొన్న జగిత్యాల వరకు చేసిన పాదయాత్రకు మించి రేపటి రైతు ధర్నా విజయవంతం చేయాలని కోరారు.బోర్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం, 15,000 మద్దతు ధర అని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పార్టీలు ఓట్ల కోసం పసుపు రైతులను మోసం చేసినై అన్నారు.రేపటి పసుపు రైతుల ధర్నాను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.