ముద్ర. పరకాల.
తనపై నమ్మకంతో ఓటేసి గెలిపించినట్లయితే 22వ వార్డును పట్టణంలో అత్యంత సుందరంగా అభివృద్ధి చేసి చూపెడతానని టిఆర్ఎస్ అభ్యర్థి ఇంగిలివీరేష్ రావు వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన తన మద్దతుదారులలో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులోని వివిధ కాలనీలలో తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. 22వ వార్డు నుండి ఇప్పటివరకు గెలుపొందిన అభ్యర్థులు ఏ అభివృద్ధి చేశారో ప్రజలు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఆయా వార్డులలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెడతానని ఇంగిలి వీరేష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గత ప్రభుత్వ హయాంలో పరకాల పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరిస్తూ ఓటును అడిగారు. తన వెంట ప్రచారంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.