మోసపూరిత బిజెపి బీఆర్ఎస్ లతో తస్మాత్ జాగ్రత్త..-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
మోసపూరిత బిజెపి బీఆర్ఎస్ లతో తస్మాత్ జాగ్రత్త..
కార్పొరేషన్ ఎన్నికల్లో
వారికి బుద్ధి చెప్పండి..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మాయమాటలతో ముందుకు వస్తున్న మోసపూరిత బీఆర్ఎస్ బిజెపిలకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గురువారం రాత్రి కరీంనగర్లోని 21,22,48,49వ డివిజన్ లో కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగులో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ రావ్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తోపాటు కార్పొరేటర్ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.