ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మున్సిపల్ బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కె శ్రీహరి రావు, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా 31 వ వార్డ్ అభ్యర్థి ధర్మాజీ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ శాస్త్రి నగర్, బోయివాడ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన చైర్మన్ అభ్యర్థి అప్పాల కావ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల అనురాధ గణేష్, కాంగ్రెస్ నాయకులు రాజేందర్, కొట్టె శేఖర్ మాజీ జడ్పీటీసీ మారుతీ, పూదరి అరవింద్, సబాకలీం, అతీక్, తదితరులు పాల్గొన్నారు.