Take a fresh look at your lifestyle.

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

  • పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు.

ముద్ర విలేకరి, సిద్ధిపేట: నాగుల పంచమి పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పుట్టలో పాలు పోసి నాగదేవత ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం అనాదిగా వస్తున్న ఆచారం. నాగుల పంచమిని పురస్కరించుకుని రంగదాంపల్లి స్వయంభు నాగదేవత అమ్మవారి దేవాలయంలోని పుట్ట వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బోనాల శ్రీనివాస్ మాట్లాడారు. స్వయంభుగా వెలసిన రంగదాంపల్లి నాగదేవత అమ్మవారు కోరిన కోర్కెలను తీరుస్తూ భక్తుల కొంగు బంగారం గా విరాజిల్లుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్, నిర్వాహకులు వంగ రాజశేఖర్ రెడ్డి లావణ్య, అరవింద్, రాజిరెడ్డి, రవికిరణ్, రాకేష్, చంద్రయ్య, సత్యనారాయణ, సింగర్ శ్రీనివాస్, దేవిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.