Take a fresh look at your lifestyle.

జూలై 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రానున్న మూడు రోజుల పాటు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పెద్దపల్లి జిల్లాలో జూలై 7 నుంచి 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి వనరులలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జర్గకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.