రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డులో ఐదు లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టే రహదారి నిర్మాణ పనులకు మాజీ వార్డు కౌన్సిలర్ అలుగల శ్రీలత – సత్తయ్య శనివారం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. గద్దె రాగడి విలేజ్ నుంచి ప్రమీల ఇంటి వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని అలుగల సత్తయ్య తెలిపారు.కాగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,రఘునాథ్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కుర్మ దినేష్, దేవి సాయి కృష్ణ,కుర్మ సుగుణాకర్, సురేందర్ పాల్గొన్నారు.